చెరువు మధ్యలో కట్ట నిర్మించి.. రూ.5,500 కోట్ల భూకబ్జా కుట్రను భగ్నం చేసిన హైడ్రా
- హైదరాబాద్ శివారులోని ముష్కిన్ చెరువు కబ్జా యత్నం భగ్నం
- చెరువు మధ్యలో నిర్మించిన అక్రమ కట్టను కూల్చివేసిన హైడ్రా
- రెండు నెలల నోటీసు తర్వాత రంగంలోకి దిగిన అధికారులు
- చెరువు సరిహద్దులకు కంచె వేసి పరిరక్షణ చర్యలు ప్రారంభం
హైదరాబాద్ శివారు ప్రాంతంలో భారీ భూకబ్జా యత్నాన్ని హైడ్రా (హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్ ప్రొటెక్షన్ ఏజెన్సీ) అధికారులు భగ్నం చేశారు. రంగారెడ్డి జిల్లా గండిపేట మండలం పరిధిలోని పుప్పాలగూడ, నార్సింగి సమీపంలో ఉన్న ముష్కిన్ చెరువును ఆక్రమించుకునేందుకు కొందరు చేసిన ప్రయత్నాలను అడ్డుకున్నారు. సుమారు రూ.5,500 కోట్ల విలువైన ప్రభుత్వ భూమిని కాపాడారు.
వివరాల్లోకి వెళితే, కొందరు రియల్ ఎస్టేట్ వ్యాపారులు ముష్కిన్ చెరువుపై కన్నేశారు. పేదలతో గుడిసెలు వేయించి, భూమిని ఆక్రమించుకునేందుకు ప్రయత్నించారు. గ్రామ రికార్డుల ప్రకారం 59.11 ఎకరాల విస్తీర్ణం ఉన్న ఈ చెరువు మధ్యలో ఏకంగా మట్టితో కట్ట నిర్మించి, 34 ఎకరాలకు పైగా భూమిని కబ్జా చేసేందుకు ప్లాన్ చేశారు.
ఈ విషయంపై దృష్టి సారించిన హైడ్రా అధికారులు, ఆక్రమణదారులకు రెండు నెలల క్రితమే నోటీసులు జారీ చేశారు. అయినా వారు ఖాళీ చేయకపోవడంతో శనివారం చెరువు మధ్యలో నిర్మించిన అక్రమ కట్టను, గుడిసెలను పూర్తిగా తొలగించారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చెరువు సరిహద్దుల వెంబడి ఫెన్సింగ్ ఏర్పాటు చేసే పనులను ప్రారంభించారు. నగరంలోని చెరువులు, ప్రభుత్వ ఆస్తుల పరిరక్షణలో భాగంగానే ఈ చర్యలు తీసుకున్నట్లు అధికారులు తెలిపారు.